బిసి వర్గానికి అధిష్టానం కేటాయించనుందా
ఇప్పటికే అధిష్టానం పలువురి పేర్లు పరిశీలించిందా
నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందా
మహీధర రెడ్డి అభిమానులు జీర్ణించుకోగలరా
ఎంబిసి కందుకూరు ప్రతినిధి జనవరి 9 గత కొన్ని రోజులుగా కందుకూరు నియోజవర్గంలో మార్పు జరగనుంది ప్రచారాలు ఉధృతంగా నేటికీ నియోజకవర్గంలో ఏ టీ కొట్టు వద్ద నలుగురు గుమి కూడిన ప్రాంతాల్లో నిరంతరం చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం మూడవ విడత నియోజకవర్గాల ఇన్చార్జులు గతంలో ఉన్న వారి మార్పు కోసం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గంలో మార్పు తప్పదు అని సంకేతాలు జోరుగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభిమానులు మాత్రం ఆయనకే టికెట్ ఖరారు కానున్నదని పేర్కొంటున్న అధిష్టానం ఆలోచనలు వేరే విధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కందుకూరు నియోజకవర్గం లో కమ్మ బలమైన సామాజిక వర్గం కాక ఓటింగ్ అధిక శాతం ఉంది తదుపరి ఎస్సీ లోని రెండు సామాజిక వర్గాలు ఓట్లు బలంగా ఉన్నాయి ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం తదుపరి బీసీ సామాజిక వర్గంలోని యాదవులు ఓట్లు దండిగా నియోజకవర్గంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు కోసం చూస్తున్నా వైసిపి అధిష్టానం తప్పనిసరిగా బీసీలకు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఇప్పటికే పార్టీ అధిష్టానం వివిధ మార్గాల ద్వారా కొన్ని పేర్లు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకు సమాచారం అందజేయగా వైసీపీ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యే మహీధర రెడ్డి ఉన్నారు కదా అని ప్రస్తావించగా బీసీల పేర్లు మీకు ఆమోదమైన వారి పేర్లు పెట్టాలని అనిల్ కుమార్ యాదవ్ టంగుటూరు కి చెందిన బొట్ల రామారావు కనిగిరి కి చెందిన డాక్టర్ పెరుగు మల్లికార్జున పేర్లు సూచించి స్పష్టత ఇవ్వాలని సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాలకు అడ్డుకట్ట ఈనెల 10న వైసీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది అధిష్టానం తీసుకునే నూతన నిర్ణయాన్ని నియోజకవర్గంలో మహిళా రెడ్డి అభిమానులు జీర్ణించుకోగలరా అనే చర్చ జరుగుతుంది మరోవైపు వైసీపీ అధిష్టానం ఆలోచన కందుకూరు నియోజకవర్గంలో బీసీ జనాభా అధికంగా ఉండటంతో గెలుపుకు అవకాశాలు ఉంటాయని నిర్ణయానికి వస్తుందా లేక మహిధర రెడ్డినే కొనసాగిస్తారా వేసి చూడాల్సి ఉంది
1 Comments
This is MLA election not only panchayat election ...
ReplyDelete