పెద్ద కనుమళ్ళలో ఘాతుకం..వివాహిత పై అత్యాచారం హత్య

భయాందోళనలో గ్రామం..రంగంలోకి దిగిన పోలీసులు.
సింగరాయకొండ ఎంబిసి ప్రతినిధి డిసెంబర్ 16
వయస్సు తారతమ్యం తో పనిలేదు అనుకున్నది చేయడమే నైజం అన్న తీరులో జరిగిన వివాహిత పై అత్యాచారం హత్య  సంఘటన సింగరాయకొండ మండలం పెద్ద కముమళ్ళ లో గురువారం చోటు చేసుకుంది. నేరాలకు పట్టణాలు గ్రామాలు అనే తేడా లేదు. చిన్న వయసు లో యువకులు ఏవిధంగా తయారు అవుతున్నారో ఈ సంఘటన రుజువు చేస్తుంది. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన వివాహిత మహిళ స్వర్ణ కృష్ణ వేణి ( 52 )  ఒక కార్యక్రమం లో పాల్గొనేందుకు గురువారం సింగరాయకొండ మండలం పెద్ద కనుమళ్ళ గ్రామానికి వచ్చి తిరిగి వెళ్ళే సందర్భం లో  ఈ సంఘటన చోటుచేసుకుంది. ముందుగానే పెద కనుమళ్ల నుండి  నందనవనం వెళ్ళే మార్గం లో దారికాచి ఉన్న పెద కనుమళ్ల గ్రామానికి చెందిన మల్లెల సూర్య కుమార్ ( 27) మానవ మృగం గా మారి 52 సంవత్సరాల వివాహిత పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన సమాచారం తెలియడంతో సింగరాయకొండ పోలీస్ లు హుటాహుటంగా సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరణలో పడ్డారు. హతు రాలికి, ముద్దాయి కి పరిచయం ఉందా? హతురాలు ఒంటరిగా  వెళ్ళడానికి కారణం ఏమిటి ? ముద్దాయి అఘాయిత్యం చేసి హత్య చేయడానికి కారణం ఏమిటి ? అనే దిశగా పోలీస్ లు సమాచార సేకరణ చేపట్టారు. వివాహిత పై అత్యాచారం హత్య సమాచారం తో జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్,ఒంగోలు డిఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, సింగరాయకొండ సిఐ మర్రి లక్ష్మణ్ లు సంఘటన వివరాలు తెలుసు కున్నారు. సంఘటన పై  సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని గ్రామంలో ప్రజలకు ధైర్యం చెప్పాలని పోలీస్ అధికారులు స్థానిక పోలీస్ లను ఆదేశించారు.

1 Comments

  1. Don't use this type of Photos it are really Journalist don't use this type of Photos

    ReplyDelete