అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. వీడియో.


చాలా మందికి దెయ్యం పేరు చెప్పగానే వణుకు పుడుతుంది. అసలు దెయ్యం ఉందా లేదా అనే వాదనను పక్కన పెడితే.. దెయ్యాలు ఉన్నాయనడానికి సాక్ష్యంగా పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు దెయ్యంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బ్యూనస్ ఎయిర్స్‌లోని ఫినోకియాటో శానిటోరియం అనే ప్రైవేట్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో తెల్లవారుజామున 3 గంటలకు ఆస్పత్రిలోని సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియోలో ఆసుపత్రి ప్రవేశ ద్వారం ఆటోమేటిక్‌గా తెరుచుకోవడం కనిపిస్తుంది. శబ్దం విని, సెక్యూరిటీ గార్డు తన సీటులోంచి లేచి, డెస్క్‌లోని క్లిప్‌బోర్డ్‌ను తీసుకొని తలుపు వైపుకు వెళ్ళాడు. లైన్ డివైడర్ తీసేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత వీల్ చైర్‌లో కూర్చొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డు ప్రవర్తన చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. అంతకు ముందు రోజు ఒక రోగి ఆసుపత్రిలో మరణించాడు. ప్రస్తుతం అతడు దెయ్యం రూపంలో వచ్చినట్లు సమాచారం. కాగా నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించారు. కొంతమంది వినియోగదారులు ఈ ఫుటేజీని చూసి నివ్వెరపోతే, మరికొందరు అది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. అయితే దీనిపై స్థానిక మీడియా ఆరా తీయగా… నవంబరు 17 రాత్రి నుంచి 18 ఉదయం 10 గంటల మధ్య ఆటోమేటిక్ గా 28 సార్లు తలుపులు తెరుచుకున్నాయని యాజమాన్యం తెలిపింది. క్లిప్‌బోర్డ్ పేపర్‌పై సెక్యూరిటీ గార్డు ఏదో రాస్తున్నట్లు వీడియోలో కనిపించగా.. రిజిస్టర్‌లో మాత్రం ఏం రాయలేదని తేలింది.

0 Comments