త్వరలో స్కైలైన్ లో మహిళల కోసం ప్రత్యేక శిక్షణ: స్కైలైన్ ఎమ్ డి శ్రీను బాషా
ఒంగోలు ఎంబిసి: స్థానిక కొప్పోలు రోడ్ లో *స్కైలైన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో* మహిళల కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు స్కైలైన్ ఎం.డి షేక్ శ్రీను బాషా తెలిపారు. బుధవారం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ సలహదారు గౌ: శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఏ పి టైలర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సుభాన్ బీ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, మహిళలు, సాధికారత అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ ప్రభుత్వం మహిళా అభ్యుదయనికి చాలా ప్రాముఖ్యత ఇస్తుందని, జగన్మోహనరెడ్డి గారి నాయకత్వం లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా సజ్జల గారు తెలిపారు. మహిళ సాధికారత కోసం, సాధ్యమైనంత వరకు నేను కృషి చేస్తానని, కుటుంబంలో మహిళలు బాగుంటే ఆ కుటుంబం మొత్తం బాగుంటుంది అని టైలరింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి సుబాన్ బీ తెలిపారు. కార్యక్రమం తదనదరం ఒంగోలు నుండి వచ్చిన పోతురాజు మరియు మిత్రబృందం సుబాన్ బీ గారిని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట లేడీస్ ల్యాండ్ నుండి నరేంద్ర, రాంబాబు, అరుణ తదితరుల పాల్గొని మహిళల ఉన్నతి కోసం , ఆర్థిక అభివృద్ధి కోసం మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పై సుభాన్ బీ గారితో చర్చించారు. కర్యక్రమం తదనంతరం, స్కై లైన్ శ్రీను బాషా మాట్లాడుతూ త్వరలో నిరుద్యోగ యువత కు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, ఉద్యోగ మేళా కండక్ట్ చేయబోతున్నాం అని విలేకరుల సమావేశంలో తెలిపారు.
1 Comments
Super srinu basha garu
ReplyDelete