ఐ.ఎన్.ఆర్ నాయకత్వంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.
గుడ్లూరు MBC ప్రతినిధి ఆగస్ట్-10 ;ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో గత ఎన్నికల తరువాత సతికిల పడ్డ టిడిపికి మరలా ఇంటూరి నాగేశ్వరరావు రాజకీయ అరంగేట్రం చేసి ,తన విశాల హృదయం తో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ,ఇబ్బందులు పడుతున్న తన పార్టీ కుటుంబాలకు, కార్యకర్తలకు తన స్నేహ హస్తం అందిస్తూ ఎంతోకొంత ఆర్థిక సహాయ సహకారాలను చేస్తూ తిరిగి నీరసించి పోయిన తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం నింపగలిగారు.నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించి రాబోయే ఎన్నికల్లో టిడిపి కందుకూరు నియోజకవర్గ స్థానంను కైవసం చేసుకొనుటకు ప్రజలమెప్పుపొందుటకు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల అనుగ్రహం కోసం అనుక్షణం శ్రమిస్తూ ,కష్ట పడుతూ భవిష్యత్తు కార్యక్రమ ప్రణాళికలు సిద్ధం చేసి తనదైన శైలిలో పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సారి కందుకూరు నియోజకవర్గ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు అనుటలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
2 Comments
ఎంత ఇచ్చాడు బ్రదర్ నీకు ఈ మేటర్ రాయడానికి
ReplyDeleteఒక్కసారి ఇక్కడికి వచ్చి పరిస్థితులు చూసి అప్పుడు రాయండి ఇతని బూతు పురాణాలూ
ReplyDelete