దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలో నడుస్తున్న రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైళ్ళు అని ఎక్కువ భాగం నార్త్ లో వాడిన బోగీలు అని మన రాష్ట్రంలో తిరుపతి , చెన్నై , విశాఖ , విజయవాడ , హైదరాబాద్ నుంచి వచ్చే ప్రజలు ప్రయాణం చేసే. బోగీలు నార్త్ లో వాడిన వాటిని తీసుకొని వచ్చి రంగులు వేసి కొత్త బోగీలు వేస్తున్నట్లు చూపిస్తున్నారు .
ఒక్క సారి ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫారం దగ్గర నుంచి ఒక్క సారి గమనించండి చాల బోగీలు స్పీడ్ బేకర్స్ మీద ఆగకుండా వాహనం ఎలా ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలాగే రైల్వే స్టేషన్ లో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తు రైలు ఫ్లాట్ ఫామ్ మీద ఆగడం గమనించండి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడ గమనించండి A/C బోగీల్లో ప్రయాణం ఇలా ఉంటే మామూలు రిజర్వేషన్, మాములు ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో మరి . ఎప్పుడైనా సరే కొత్త బోగీలు అయితే ఇలాంటి శబ్దాలు రావు కానీ మన రాష్ట్ర ప్రజలు నార్త్ లో వాడిన బోగీలల్లో మన ప్రజలు ప్రయాణం చేయవలసిన పరిస్థితి . ఎలాగో రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేవు ఇవ్వరు కనీసం మంచి రైల్వే బోగీలు ఇవ్వవచ్చు కదా , బోగీల్లో టాయిలెట్స్ కూడ వాసనతో నీళ్ళు కూడ సరిగా పోవడం విచారకరం . రైల్వే శాఖ మాత్రం మన భారత రైల్వే ఎంతో అభివృద్ధి చెందింది అంటున్నారు ఎక్కడ అభివృద్ధి ఎంతో ఖర్చు చేసి రైలు ప్రయాణం బోగీలు వాసన , టాయిలెట్స్ పరిశుభ్రంగా లేని పరిస్థితి దానికి తోడు పెద్ద పెద్ద శబ్దాలు తో బోగీలు ఇంత ఆన్యాయం జరుగుతున్న ప్రజాప్రతినిధులకు ఏమి పట్టనట్లు ఉంటున్నారు ఈమధ్య కాలంలో హైదరాబాద్ , తిరుపతి ,చెన్నై ప్రయాణం చేసిన సందర్భంగా ప్రజలు అభిప్రాయ పడుతున్నారు . ఇప్పటికైనా రైల్వే శాఖ , ప్రజాప్రతినిధులు ఒక్క సారి పరిశీలించండి .
ఒంగోలు సిటిజన్ అసోసియేషన్
అధ్యక్షుడు
కొల్లా మధు
1 Comments
Thanks sir. ఈ విషయాన్ని మెయిన్ మీడియా లో వచ్చేటట్లు సూడండి....ple
ReplyDelete