దివ్యాంగుల మధ్య జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషం--పేర్ణమిట్ట సాయి. సచివాలయ ఉద్యోగి

సచివాలయ ఉద్యోగుల ను పర్మినెంట్ చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కి ధన్యవాదాలు.
కందుకూరు ఎంబిసి ప్రతినిధి జూన్ ఇరవై ఏడు  
 పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సాయి పేర్నమిట్ట  జన్మదినం సందర్భం గా కోవూరు రోడ్డులోని స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక దివ్యాంగుల మధ్య కేకు కట్ చేసి వారికి  మద్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. మానసిక వికలాంగుల మధ్య కలిసి పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్ని సాయి అన్నారు.ఈ సందర్భంగా వాసవి సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక సేవ అలవర్చుకొని ఒంటరిగా మొదలైన  ప్రయాణంలో మరో నలుగురిని కలుపుకొని... అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అన్నాడు. సాయి గతేడాది కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది. అప్పటి నుండి అందుబాటులో ఉన్న నిరుపేదలకు భోజనం వండుకుని ప్యాక్‌ చేసుకుని ఆకలితో ఉన్న వారికల్లా వాటిని పంచేవారు. అలగే తను పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉద్యోగానికి కి వెళ్ళే మార్గం లో ఆకలి తో బిక్షాటన చేసే యాచకులకు, నిరాశ్రయులు  ఉంటారని బిస్కెట్లు, బ్రెడ్‌ పాకెట్లనూ  తీసుకోని వెళ్లి వాళ్ళకి ఆకలి తీర్చేవారు. వారికీ ఉన్నదాంట్లో కొందరి ఆకలినైనా తీర్చడం చాలా సంతృప్తినిస్తోంది అని అన్నారు. అటు సేవ గుణంమే కాకుండా తన ఉద్యోగం లో కూడా ఉత్తమ ప్రతిభను కనబరుస్తు జిల్లా కలెక్టర్  చేతుల మీదుగా కూడా అవార్డులు తీసుకున్నారు సాయి. ఈ కార్యక్రమములో  హరి  ఆరికట్ల  తదితరులు పాల్గొన్నారు.

1 Comments

  1. అందుకే రాష్ట్ర సచివాలయ సిబ్బంది మిమల్ని ఇష్టపడతారు. మీ మంచితనం మీరు
    పెద్దలకు గౌరవించే విధానం, మీ గుణం గొప్పది సాయి సర్ #gramaward #sachivalayam #union #leader #saipernamitta #saianna #prakasamdt #sai #sachivalyam #gswshelper #gramasachivalayam #GramaWardSachivalayam #ap #sai #pernamitta #prakasam #digitalassisstant #సచివాలయం #సాయిపేర్నమిట్ట

    ReplyDelete