సమాజానికి సేవ " మీలో నేను " వెబ్ సిరీస్ న్యూ ఎపిసోడ్ పూర్తి
విశాఖపట్నం ఎంబిసి: నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అద్వర్యం లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి సమర్పణ లో ఎంతో ఆదరణ పొందిన వెబ్ సిరీస్ " మీలో నేను " సీజన్ 2 లో భాగంగా ఈ రోజు స్థానిక ఎంవీపీ కాలనీ లో ఉన్న టీవీ టూరిజం స్టూడియో లో , సరిక్రొత్త ఎపిసోడ్ పార్వతి పురం మన్యం జిల్లా మారుమూల గ్రామము పెదమేరంగి గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకురాలు శ్రీమతి వెలగాడ అన్నపూర్ణమ్మ గారి జీవిత విశేషాలు తో కూడిన టాక్ షో ఇంటర్వ్యూ , ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో విడుదల కు సిద్ధమని తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం లో పుట్టి , సమాజం లో ఎంతోమంది ఎన్నో సేవలు "మీలో నేను" అందరితో నేను అనేలా, అజరామర నిస్వార్ధ సేవలు చేస్తూ, అందరి వద్ద నుండి ప్రేమ ఆదరణ పొందుతున్న, వారి జీవిత విశేషాలు, అందరికి తెలియపరచడం ద్వారా, ఏఒక్కర్తెనా స్ఫూర్తి పొంది, సమాజం పట్ల భాద్యత నెరిగి, మానవత్వం తో మంచి పనులు చేస్తారని, ముఖ్య లక్ష్యంగా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ జరుపుకుంటుంది, ఎంతోమంది మహానుభావుల స్ఫూర్తిదాయక జీవనవిధానాల్ని, ప్రపంచానికి తెలియపరచి అభినందనలు పొందింది . రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్తేజ , ప్రేరణ పూరిత ,సేవ మహానుభావుల కధలను టీవీ టూరిజం ఆవిష్కరణకు నిరంతరం ప్రయాణిస్తుంది . మీలో ఎవ్వరైనా ఈ సేవ కార్యక్రమం లో పాల్గొనవచ్చు మీరు కనక ఏదైనా సమాజానికి సేవ చేస్తున్నాను అని అనిపిస్తే , ఈ హెల్ప్ లైన్ 9848418582 ద్వారా మీ స్ఫూర్తి దాయక కథను తెలియపరచండి , మా టీం మీదగ్గరకు వచ్చి మీ చిత్రాన్ని షూట్ చేస్తుంది. అంటూ పిలుపునిచ్చ్చారు .ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి, ఎడిటర్ నీరజ , హీరో నిర్మాత ఆదిత్యభూషణ్ టీవీ టూరిజం టీం పాల్గొన్నారు.
0 Comments