గురువులు ప్రపంచ విజ్ఞాన వికాసానికి వారధులు

గురువులు ప్రపంచ విజ్ఞాన వికాసానికి వారధులు.. టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి 


కందుకూరు ఎంబిసి: గురువులు ప్రపంచ విజ్ఞాన వికాసానికి వారధులని కందుకూరు టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు షేక్ నాగూర్ వలి గారు అన్నారు. గురుపూజ దినోత్సవ వేడుకలో భాగంగా తొలుత ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాగూర్ వలి గారు మాట్లాడుతూ, గురువులు నిరంతరం విద్యార్థులకు మార్గదర్శకులు అన్నారు. ఉపాధ్యాయునిగా ఉండి, దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవన ప్రస్థానాన్ని ఆయన ప్రస్తుతించారు. విద్యార్థులు ఏక మనస్కులై, దీక్ష, దక్షతలతో విద్యనభ్యసించి, జీవితంలో మహోన్నతంగా పయనించాలని నాగూరు వలి గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. "నేటి ఆధునిక యుగం విజ్ఞానయుగమని., విజ్ఞాని ఎక్కడైనా అజేయంగా నిలుస్తారని", ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులను అధ్యాపకేతర సిబ్బందిని దుశ్యాలువాలు కప్పి,కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించారు.

0 Comments