పర్యాటక సంబరాలు "ఎస్ - యూ అండ్ ఎంజాయ్ సమ్మిట్" బ్రోచర్ విడుదల
=డాక్టర్ మణి భూషణ్ అద్వర్యం లో=
విశాఖపట్నం ఎంబిసి: నగరానికి చెందిన ప్రముఖ పర్యాటక స్వచ్ఛంద సంస్థ అయిన విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ (విటిటిఎఫ్ ) వారి ప్రపంచ పర్యాటక దినోత్సవం సంబరాలు సందర్భంగా "ఎస్ - యూ అండ్ ఎంజాయ్ సమ్మిట్" ని నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత , విటిటిఎఫ్ జాతీయ ప్రెసిడెంట్ డాక్టర్ మణి భూషణ్ మరియు హోటల్ దసపల్లా జేఎండీ శ్రీ వెంకట కృష్ణ గారి చేతులమీదుగా ఈవెంట్ యొక్క బ్రోచర్ అంగరంగ వైభవంగా విడుదల చేసారు. ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఈనెల 26 న నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో పర్యాటకం, సంస్కృతి, చరిత్ర, మరియు సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, సమాజ భాగస్వామ్యం మరియు వినోదాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ "ఎస్ - యూ అండ్ ఎంజాయ్ సమ్మిట్" ద్వారా సంస్కృతి, చరిత్ర మరియు వారసత్వం ,ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ మరియు జీవవైవిధ్యం, కళ, సాహిత్యం మరియు హస్తకళలు, సాధికారత, ఆరోగ్యం మరియు సంతోషం, సాహసం, సుస్థిర మార్పు మరియు సామాజిక బాధ్యత , విద్య, పిల్లల భాగస్వామ్యం మరియు సమాజ సేవ వంటి వాటిపై అవగహన కల్పిస్తూ ప్రజలను భాగస్వామ్యం చెయ్యడం అనేది ముఖ్య లక్ష్యం మరియు ఈ సమ్మిట్ లో ఉండే ప్రత్యేకతలు సంగీతం, గానం, నృత్యం, మరియు నాటకాలతో కూడిన కళా ప్రదర్శనలు , సమాజానికి అంకితభావంతో సేవ చేసిన ప్రముఖ వ్యక్తులను సత్కరించే కార్యక్రమం. స్థానిక ప్రతిభ మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించే ఇంటరాక్టివ్ సెషన్స్ మరియు ప్రదర్శనలు , పర్యాటక రంగంలోని వాటాదారులందరికీ నెట్‌వర్కింగ్ మరియు సహకారానికి ఒక వేదిక గ ఈ ఈవెంట్ నిలుస్తుందని, అందరి కి ఆనందాన్ని , పర్యాటకాన్ని ఎప్పటికి మరచిపోని విదంగా ఉండేలా కార్యక్రమం రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా జేఎండీ శ్రీ వెంకట కృష్ణ గారు మాట్లాడుతూ ఈ "ఎస్ - యూ అండ్ ఎంజాయ్ సమ్మిట్" ను ప్రసిద్ధ దర్శకుడు మరియు జాతీయ అవార్డు గ్రహీత డా. మణి భూషణ్ గారు రూపొందించి, దర్శకత్వం వహిస్తున్నారు. పర్యాటకం, సంస్కృతి మరియు సమాజ అభివృద్ధిని ప్రోత్సహించే ఒక మరపురాని మరియు ఆకర్షణీయమైన అనుభవాన్ని సృష్టించాలనేది డా. మణి భూషణ్ గారి దార్శనికత , అయన ఎన్నోఏళ్లుగా పర్యాటక అభివృద్ధికి నిస్వార్ధ సేవలు అందిస్తూ ప్రపంచ పర్యాటకుల మన్ననలు , జాతీయ , రాష్ట్ర , స్థానిక స్థాయి అవార్డులు పొందిన ప్రతిభ సేవ కలగలిసిన మానవతా వాది వారు ప్రతి సంవత్సరం చేస్తున్న పర్యాటక సంబరాలు కార్యక్రమం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.హీరో మరియు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య భూషణ్ మాట్లాడుతూ ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు విటిటిఎఫ్ ని 9848418582 నంబర్‌కు సంప్రదించవచ్చు అని తెలిపారు, పర్యాటకం, సంస్కృతి మరియు సమాజ స్ఫూర్తిని చాటి చెప్పే ఈ ప్రత్యేక వేడుకలో మీరు భాగం కావడానికి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు! అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ లో సీఈఓ సీత రామ స్వామి, ఎడిటర్ నీరజ మరియు మిత్రులు హాజరయ్యారు.
0 Comments