టి. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కందుకూరు నందు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధుల నివారణకు అవగాహన సదస్సు
కందుకూరు ఎంబిసి: టి. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కందుకూరు నందు రెడ్ రిబ్బన్ క్లబ్ నోడల్ ఆఫీసర్ సయ్యద్ షాలిమా సుల్తానా గారి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధుల నివారణకు అవగాహన సదస్సు నిర్వహించబడినది.
ఈ కార్యక్రమమునకు రీజనల్ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ పి. కిరణ్ గారు డాక్టర్. పి ప్రసాద్ గారు డర్మటాలజిస్ట్ ,ఏరియా హాస్పిటల్, పి. స్టాలిన్ గారు కన్సల్టెంట్ ఐ. సి. టి. సి ఏరియా హాస్పిటల్, వి. సునీత గారు, కే. లావణ్య గారు ఎయిడ్స్ కంట్రోలర్ ప్రోగ్రామింగ్ స్టాఫ్ వారి యొక్క సందేశాలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కే హజరతయ్య గారు ఆధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ షేక్ నాగూర్ వలి గారు ఈ ప్రకటనలో తెలియజేశారు.
0 Comments