విప్లవాభిమాని కామ్రేడ్ షేక్ సలీమూన్ సంస్మరణ సభ
జూలకల్లు, 03/09/2025 ఎంబిసి: జూలకల్లు గ్రామంలో విప్లవాభిమాని కామ్రేడ్ షేక్ సలీమూన్ సంస్మరణ సభను ఈరోజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రజాసంఘాలు ఘనంగా నిర్వహించాయి. పల్నాడు ప్రాంతంలో విప్లవోద్యమానికి చిరకాలంగా అభిమానిగా నిలిచి ఉద్యమ కార్యకర్తలకు అమ్మగా నిలిచిన సలీమూన్ ఇటీవల మరణించారు.
ఈ సందర్భంగా సహచరుడు కామ్రేడ్ గపూర్ మాట్లాడుతూ, సలీమూన్ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడమే కాక ఆకలితో వచ్చిన విప్లవకారులకు అన్నం పెట్టి కడదాకా ఉద్యమ సానుభూతిపరురాలిగా నిలిచిందని అన్నారు. పిడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. సభలో పిడిఎం సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు వి. కోట నాయక్, పీకేఎస్ రాష్ట్ర నాయకులు బి. కొండారెడ్డి, పౌరహక్కుల సంఘం నాయకులు వినుకొండ పేరయ్య, ప్రజాకళా మండలి రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉన్నం రాణి, సామాజిక కార్యకర్తలు కోలా రమణారెడ్డి, భూతం అన్నపూర్ణ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
0 Comments