ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచండి

నెల్లూరు D V E O. (డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్) బీవీ. కృష్ణారెడ్డి


వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ,నెల్లూరు జిల్లా డివిఇఓ. బీవీ. కృష్ణారెడ్డి గారు సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారి ఆధ్వర్యంలో అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బివి. కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్దేశములను అనుసరించి బోధనాంశములను అధ్యాపకులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, అధ్యాపకులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డివి ఈవో. కృష్ణారెడ్డి గారు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అధ్యాపకులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ యుతమైన వాతావరణంలో మంచి విద్యాబుద్ధులు అందించడమే లక్ష్యంగా, సమయపాలన పాటిస్తూ, సమిష్టి గా అధ్యాపకులు కృషి చేయాలని కృష్ణారెడ్డి గారు వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారు, అధ్యాపక బృందంతో కలిసి నెల్లూరు జిల్లా డివిఇఓ బీవీ కృష్ణారెడ్డి గారిని దుశ్యాలు కప్పి, పుష్ప గుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.

0 Comments