ఆర్ఐఓ. పి. వర ప్రసాద నాయుడు కితాబు
టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వాతావరణం అనేక వృక్షములతో,పుష్ప రాజములతో, హరిత వర్ణ శోభితమై, మిక్కిలి మనోహరముగా ఉన్నదని నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆర్ ఐ ఓ. పి .వరప్రసాద నాయుడు గారు అన్నారు మంగళవారం ఉదయం ఆయన టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆర్ఐఓ. విద్యార్థులను పాఠ్యాంశాలకు సంబంధించిన పలు ప్రశ్నలను అడిగి వారి వద్ద నుండి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల లో పనిచేసే వివిధ శాఖల అధ్యాపకులతో, ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారి సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ గారు మాట్లాడుతూ, అధ్యాపకులు పాఠ్యాంశాల బోధనలో సులభ శైలి మెళకువ లతో, బోధించాలన్నారు. కళాశాలలో జరుగుతున్న త్రైమాసిక పరీక్షల విధానాన్ని ఆర్ఐఓ పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి గారు, అధ్యాపక బృందం కలిసి ఆర్ఐవో. పి. వరప్రసాద నాయుడు ను దుశ్యాలువాతో, పుష్ప గుచ్ఛం అంద చేసి ఘనంగా సత్కరించారు.
0 Comments