గిరిజన విద్యావ్యస్థపై కూటమి సర్కార్ సీతా కన్ను..!

గిరిజన విద్యావ్యస్థపై కూటమి సర్కార్ సీతా కన్ను..!

గిరి విద్యార్థులపై శాపంగా మారిన చంద్రబాబు 

ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టించింది నేను అనడం హాస్యస్పదం.

మీడియా సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు


ఎంబిసి న్యూస్ ప్రతినిధి. పాడేరు:.క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాసన సభ్యులు వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో సుమారు 86 పాఠశాలల్లో ఈరోజు వరకు ఉపాధ్యాయులు లేకపోవడం చాలా బాధాకరం, పాఠశాలలు తెరుచుకుని నాలుగు నెలలు గడిచిన ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తల్లి తండ్రులు ఆవేదన చెందుతున్నారు, విద్యార్థులకు విద్య బోధన అందక చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కానీ అధికారులకు కానీ కనీసం గుర్తుకు రాట్లేదా? విద్యార్థులకు సరైన సమయంలో విద్య అందించక పోతే అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వామ్యులు అయ్యే ప్రమాదం ఉంది.. కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే పాఠశాలల్లో ఉపాధ్యాయులు నియమించాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంత విద్యార్థులు భావితరాలు బాగుండాలని మంచి సంకల్పంతో పాడు బడ్డ పాఠశాలలు నాడు నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలు మాదిరిగా రూపు రేఖలు మార్చి ప్రతి పాఠశాలల్లో మంచి విద్య బోధన అందించగలిగారు అని అన్నారు. అనాడు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ప్రతి పార్లిమెంట్ పరిధిలో మెడికల్ కాలేజ్ ఉండాలని ఇచ్చిన మాట ప్రకారం 17 మెడికల్ కాలేజీ లు తీసుకొచ్చి పనులు ప్రారంభించి పూర్తి స్థాయిలో తీసుకు వచ్చారు ... ఈరోజు చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం బహిరంగ సమావేశాల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది నేనే అని చెప్పుకోవడం చాలా హాస్యస్పదంగా ఉందని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు అన్నారు.. గత 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇంత అనుభవం ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ నిర్మించలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి కి మంచి పేరు వస్తుందని అక్కసుతో ఈరోజు నేనే మెడికల్ కాలేజీలు కట్టించను అని చెప్పుకుంటున్నావ్.. కనీసం సిగ్గు ఉండాలి చెప్పుకోవడానికి..రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకోచారన్నది మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితుల్లో దిగజారిపోయావ్ అని అన్నారు... చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని సమాచారం తెలిసింది. మా పాడేరు మెడికల్ కాలేజ్ మా గిరిజన ప్రాంత ప్రజలకు ఎంతో వరం ! అలాంటి కాలేజీకి కూటమి ప్రభుత్వం శాపం పెడితే మాత్రం ఊరుకోం అని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు,జిల్లా మహిళా అధ్యక్షురాలు కురూస పార్వతమ్మ, నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు కిల్లో ఊర్వశి రాణి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు శరభ సూర్యనారాయణ, కించూరు సర్పంచ్ వంతాల రాంబాబు, క్రిస్టియన్ మైనారిటీ విభాగం నాయకులు మోద బాబూరావు, ఐటీ విభాగం నాయకులు కూడా సుబ్రమణ్యం, పాడేరు మండల యూత్ అధ్యక్షులు గల్లెలి లింగమూర్తి, మాజీ సర్పంచ్ మినుముల కన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు,_

0 Comments