అరసవల్లి లో "ఎస్ - యు & ఎంజాయ్ సుమ్మిట్ 2025" ఈవెంట్ పోస్టర్ విడుదల


విశాఖపట్నం ఎంబిసి: నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి అద్వర్యం లో ఈనెల 26 న జరగబోయే ప్రపంచ పర్యాటక దినోత్స్వం వేడుకలు సంబందించిన పోస్టర్ ను ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, అరసవల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ మణి భూషణ్ మరియు శ్రీమతి నీరజ దంపతుల చేతులమీదుగా అశేష భక్తుల మధ్య " ఎస్ - యు & ఎంజాయ్ సమ్మిట్ 2025 " విడుదల చేసారు . ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, అలాగే ప్రతిష్టాత్మకమైన నేషనల్ సేవా ఐకాన్ అవార్డ్స్ ప్రదానోత్సవం సంబరాలు చేస్తున్నామని , ఈ ఈవెంట్ ద్వారా పర్యాటకం, సంస్కృతి, సామాజిక సేవలను ప్రోత్సహించడం, పర్యాటకరంగం పట్ల అవగహన , చైతన్యం కలిగించే లా మన యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి కృషిచేస్తున్నామని. నిస్వార్థ సేవ, అంకితభావంతో సమాజానికి గణనీయమైన సేవలు అందించిన వ్యక్తులను గౌరవించడానికి ఈ వేదిక ఏర్పాటు చేయబడింది అని, ఈరోజు పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం లో ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం జరగడం చాలా ఆనంద దాయకం అని, క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భారతదేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం యొక్క అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాముఖ్యత మరియు టెంపుల్ టూరిజం లో ఎంతో అభివృద్ధి చెందింది అని తెలిపారు, ఈ ఈవెంట్ యొక్క మరిన్ని వివరాలకు 9848418582 ద్వారా పొందవచ్చు అని తెలియజెసారు.  ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ భూషణ్ , హీరో ఆదిత్యభూషణ్, సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఇతరులు హాజరయ్యారు.

0 Comments