ఈ నెల 15 నుండి జరిగే రణభేరి జయప్రదం చేయండి

యుటిఎఫ్ అల్లూరి జిల్లా అధ్యక్షులు మహేష్ పిలుపు.


ఎంబిసి ప్రతినిధి పాడేరు: పాడేరు యుటిఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద రణభేరి కరపత్రాలను యుటిఎఫ్ నాయకులు విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా యూటియఫ్ జిల్లా అధ్యక్షులు వి.మహేశ్వర రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారంలోనూ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం లోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో గత ప్రభుత్వం పైన మూడు సంవత్సరాల కాలం పోరుబాట చేసాం. అయినా గత ప్రభుత్వం స్పందించకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం గడిచిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ఏమాత్రం చొరవ చూపకపోవడం తగదన్నారు. విద్యారంగ సమస్యలు నానాటికి ఉత్పన్నం అవుతున్నాయి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు.  ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్థిక బకాయిలన్నీ చెల్లింపు జరిగి పి ఆర్ సి కమిటీ వేస్తారని IR 30% శాతం చెల్లిస్తారని ఆశించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు భంగపాటు తప్ప మరొకటి లేదన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ అన్ని రకాల పెన్షన్ బెనిఫిట్స్ ఇస్తారని ఆశించిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నిరాశ మిగిలింది అన్నారు. ముఖ్యమంత్రి నుండి ఇప్పటివరకు ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లింపు పైన గాని అలాగే పిఆర్సి కమిటీ పైన గాని ఐ ఆర్ ఇవ్వటం గాని ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) గా రాష్ట్రవ్యాప్తంగా రణభేరి కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు (పాడేరు) రణభేరి కార్యక్రమం ఈనెల 18న అరకు లోయ నుండి ప్రారంభమై 18 సాయంత్రం వి.మాడుగుల లో ముగుస్తుందని తెలిపారు. అందుకోసం ఈ రణభేరి కార్యక్రమం కొరకు జిల్లాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాము. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు టి.చిట్టిబాబు,జిల్లా కార్యదర్శులు యమ్.ధర్మా రావు, పి.దేముడు, యస్.కన్నయ్య, ఆడిట్ కమిటీ సభ్యులు కె.రఘునాధ్, యల్.నారాయణ, సీనియర్ నాయకులు యస్.రాంబాబు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments