హెల్త్ అసిస్టెంట్లకు మైండ్ బ్లాక్
రీ డిప్లైమెంట్లో అవకతవకలు
ముందుగానే బ్లాక్ దందాలో హెల్త్ అసిస్టెంట్ల పేర్లు
అమరావతి ప్రతినిధి ఎంబీసీ: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పటయ్యాక అల్లూరి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టిన సాదరణ రీ డిప్లయ్ మెంట్ కౌన్సిలింగ్లో హెల్త్ అసిస్టెంట్లకు మైండ్ బ్లాక్ అయ్యింది.ఇష్ట రాజ్యాంగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన అల్లూరి జిల్లా వైద్యశాఖధికారితో కొంతమంది యూనియన్ నాయకులని చెప్పుకొని నిబంధనలకు సాకుగా చూపి ఆయా మండల కేంద్రాలకు దగ్గరలో ఉన్న కీలక ప్రాంతాల్లో పోస్టులను బ్లాక్ చేసి రూ.40 వేలు నుంచి రూ.50 వేలు వరకు అమ్మేసారని మండిపడుతున్నారు.వివరాలు మేరకు..ఇటీవల అల్లూరి జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయంలో ఈనెల 30న 11 మండలాల పరిధి 36 పిహెచ్సిలో పనిచేస్తున్న 140 మంది హెల్త్ అసిస్టెంట్లకు రీడిప్లయ్మెంట్ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ కౌన్సిలింగ్లో భాగంగా ప్రభుత్వ నిబంధనాలకు విరుద్ధంగా సాకుగా చూపి సుమారు 50 నుంచి 60 పోస్టులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి తమర్భ.విశ్వేశ్వరనాయుడుతో కొంతమంది సీనియర్ ఉద్యోగులు శెట్టి.నాగరాజుతోపాటు కొంతమంది భిన్నంగా వ్యవహరించి 2012,2015,2017 సంవత్సరంలో అపాయింట్మెంట్ అయినా కొంతమంది హెల్త్ అసిస్టెంట్ల పేర్లు మీద పోస్టులు బ్లాక్ చేసి తమతో రూ.40 వేలు నుంచి రూ.50 వేలు వరకు డీల్ కుదుర్చుకున్న వాళ్ళకి వారికి నచ్చిన స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 6వ తేదీన విశాఖలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్ల మొదట విడత కౌన్సిల్ జిల్లా మలేరియా అధికారిణి ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా నిర్వహించారు.కాగా ఆ కౌన్సిలింగ్ కాదని కొంతమంది సీనియర్ ఉద్యోగులు అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖలో యూనియన్ నాయకులని సాకులు చెప్పి ఇటీవల నూతనంగా నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో చేతులు కలిపి లక్షల్లో చేతులు మారి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న కొంతమంది హెల్త్ అసిస్టెంట్లు తమ ధ్రువీకరణ పత్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమర్పిస్తూ తమకు అనుకూల పైన ప్లేస్ లో పోస్ట్‌లు ఇప్పించాలని ఎన్నో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ నాకు నచ్చిన ప్రాంతంలోనే మీరు విధులు నిర్వహించాలని తమ ఆఫీసు చుట్టూ తిరుగుతే మీకు విధుల నుంచి తొలగిస్తానని జీతాలు నిలుపుదల చేస్తానని అనారోగ్యం సమస్యతో బాధపడుతున్న హెల్త్ అసిస్టెంట్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విశ్వేశ్వరనాయుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొంతమంది వెల్త్ అసిస్టెంట్లు మానసిక వేదనకు గురవుతూ కంటతడి పెడుతున్నారు.కొయ్యూరు నుంచి అనంతగిరి మండలానికి వెళ్లి విధులు నిర్వహించాల్సిందేనని అనంతగిరి నుంచి కొయ్యూరు సీలేరుకు ఎంత దూరమైనా వెళ్లి విధులు నిర్వహించాల్సిందేనని మానసిక వేదనానికి గురిచేస్తూ అనేక పదజాలాలతో తిడుతూ..తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని హెల్త్ అసిస్టెంట్లు మానసిక తీవ్ర వేదనకు గురవుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు.రీ డిప్లయ్మెంట్లో జరిగిన అవకతవకల్లు రుజువు చేయాలంటే..హుకుంపేట మండలంలోని ఉప్ప పీహెచ్సి పరిధిలో పనిచేస్తున్న 2006 బ్యాచ్ కు సంబంధించిన హెల్త్ అసిస్టెంట్ రమేష్ హుకుంపేట మండలంలోని ముల్యాపుట్టు సచివాలయంలో తనకు పోస్ట్ ఇవ్వాలని కోరగా 2017 బ్యాచ్‌కు చెందిన కిల్లో.మమ్ముటీ పేరు ముందుగానే పేరు రాసిపెట్టి బ్లాక్ చేసి ఉండగా హెల్త్ అసిస్టెంట్ రమేష్ అవక్కయ్యారు.ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తానని కార్యాలయానికి ఆయన వచ్చినప్పటికీ ఆయనకు అధికారులు కార్యాలయం నుంచి తిరిగి పంపించి వేశారు.అలాగే అదే పిహెచ్సి పరిధి పట్టం,గత్తుం సచివాలయల్లో విధులు నిర్వహిస్తున్న శెట్టి.అప్పలకొండ పేరును కూడా ముందుగానే పేరు రాసిపెట్టి బ్లాక్ చేసి ఉండడంతో ఆర్డర్ ప్రకారంగా ఆయన కంటే ముందున్న ఉద్యోగులు అవక్కయ్యారు.ఈ విషయమై జిల్లా ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు కొంతమంది సీనియర్ ఉద్యోగుల తప్పిదంతో రీ డిప్లయ్మేంట్ ఆకతవకలు జరిగినందున తక్షణమే ఈ కౌన్సిలింగ్ ను రద్దుచేసి ఏఏ పీహెచ్‌సీల పరిధిలో తీవ్రంగా నష్టముందో సరైన ఎంక్వయిరీ చేసి రీ కౌన్సిలింగ్ నిర్వహించి హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని లేదా జూన్ నెల 6న విశాఖ జిల్లాలో జరిగిన కౌన్సిలింగ్ ఆధారంగా హెల్త్ అసిస్టెంట్లకు జాయినింగ్ ఉత్తర్వులు (ఆర్డర్లు) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.తక్షణమే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పందించాలని కోరుతున్నారు.
0 Comments