జానపద కలలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గా వంపురి గంగులయ్య నియామకం...
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు..ఎంబిసి న్యూస్ ప్రతినిధి పాడేరు..జానపద కలలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గా వంపురి గంగులయ్య నియామకం.. ఈ శుభ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను పుష్పగుచ్చాలు దు సాలువతో సన్మానించి, పార్టీ శ్రేణులు అభిమానులు కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు...
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరుగున పడిపోయిన ప్రాచీన జానపద కళలును వెలికి తీసి పూర్వ వైభవం గా గిరిజన ప్రాంత వాసులకు అభివృద్ధి చెందేలా అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు... ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటాను అని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు...
0 Comments