కళాశాలలో మీ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి.. ప్రిన్సిపాల్ ఎస్ కే నాగూర్ వలి


కందుకూరు ఎంబిసి: టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కందుకూరు నందు ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ MPC,Bipc,CEC,HEC మరియు MPHW, OA గ్రూపులలో అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి శ్రీమతి డాక్టర్ కృతికాశుక్ల IAS గారి ఉత్తర్వుల మేరకు ఆగస్టు 11వ తేదీ చివరి తేదీ కావున పదవ తరగతి పాసై ఇప్పటివరకు అడ్మిషన్ పొందని విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ కళాశాలలో చేరవలెను. చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉచితంగా అందజేయబడతాయి. అన్ని వసతులతో డిజిటల్ క్లాస్ రూములు, ప్రయోగశాలలు,ఆటస్థలం గ్రంథాలయం వంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడ్డాయి కనుక కందుకూరు పరిసర ప్రాంత పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో మీ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని అని ప్రిన్సిపాల్ శ్రీ ఎస్ కే నాగూర్ వలి గారు తెలియజేశారు.

0 Comments