రాష్ట్ర అధ్యక్షులు పర్యటన విజయవంతం చేయండి..బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు.

రాష్ట్ర అధ్యక్షులు పర్యటన విజయవంతం చేయండి.. బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు.


మేడికొండూరు ఎంబిసి ప్రతినిధి: బిజెపి రాష్ట్ర రధసారధి పి.వి.న్. మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తరువాత " సారద్యం " రాష్ట్ర పర్యటనలో భాగంగా మొట్టమొదటి సారిగా మన గుంటూరుకు 05-8-2025 న మంగళవారం విచేస్తున్నారని బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు తెలియజేశారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షతన జరుగుతున్న ఈ పర్యటనలో ఉదయం 9:30 నిముషాలకు అమరావతి రోడ్డు లోని చిల్లీస్ ఢాబా దగ్గర నుంచి ర్యాలీ మొదలు ఆవుతుందనీ, అక్కడి నుంచి ర్యాలీ గా బయలుదేరి ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెక్షన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ ఉంటుందని, ఆ తదనంతరం శ్రీ కన్వెన్షన్ హాల్లో బిజెపి విస్తృత కార్యకర్తల సమావేశంలో కార్యకర్తను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు కార్యకర్తలు మార్గదర్శనం చేస్తారు. ఈ కార్యక్రమం ఉదయం 11:00 నుండి 1.00 వరకు జరుగుతుందని వై.వి.సుబ్బారావు తెలియజేశారు. కావున జిల్లాలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షుల పి.వి.ఎన్ మాధవ్ పర్యటన విజయవంతం చేయవలసినదిగా బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వి. సుబ్బారావు కోరారు.

0 Comments