విటిటిఎఫ్ వారి ఉచిత మట్టిగణపతి విగ్రహాలు వితరణ లో పాల్గొన్న డాక్టర్ మణి భూషణ్


విశాఖపట్నం ఎంబిసి: నగరానికి చెందిన ప్రముఖ పర్యాటక స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ ఎన్నో సేవల్లో భాగంగా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిపే వినాయకచవితి సంబరాలు సందర్బంగా పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలు వితరణ కార్యక్రమం స్థానిక ఎంవీపీ కాలనీ లో ఉన్న టీవీ టూరిజం అడ్మిన్ ఆఫీస్ వద్ద ముఖ్య అతిధి బ్రహ్మకుమారి రామేశ్వరి అక్క మరియు డాక్టర్ మణి భూషణ్ చేతులమీదుగా అంగరంగ వైభవంగా చేసారు . డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ వినాయకచవితి మట్టి గణపతి తో పూజ చేసి అందరు గణేష్ మహారాజ్ ఆసిస్సులు పొందాలని విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ ఆశిస్తుంది పర్యవరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతి , జీవవైవిధ్యం , సమతుల్యత ప్రధాన అంశంగా మన పండగల విశిష్టతను , ప్రాధాన్యతను గుర్తించి మన పూర్వికులు పెట్టిన సంప్రాదయాలను పాటిస్తూ వినాయక చవితి విగ్రహాలు మట్టి తో చేసినవి ఉపయోగించడం వలన సమాజానికి సేవ చేసినవాళ్లు అవడమే కాకా మహాగణపతి దేవుని అస్సిసులు కూడా పొందుతారని ప్రతి ఒక్కరు ఆదిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరుపున బ్రహ్మకుమారి రామేశ్వరి అక్క మాట్లాడుతూ వినాయకచవితి విశిష్టత ను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీతారామస్వామి , ఎడిటర్ నీరజ , హీరో ఆదిత్యభూషణ్, వెంకటలక్ష్మి , విశిష్ట అతిధులు మరియు మిత్రులు ఎంతోమంది పాల్గొని విజయవంతం చేసారు.

0 Comments