" చూశారా... భీమిలి...? " ఏఐ పర్యాటక చిత్రం పూర్తి --డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో --
విశాఖపట్నం ఎంబిసి: నగరానికి చెందిన ప్రముఖ పర్యాటక సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి అద్వర్యం లో గత 28 ఏళ్లగా ఎన్నో సేవలు అందిస్తున్న డిజిటల్ వీడియోస్ సంస్థ వారి నిర్వహణలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆఫీషియల్ వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి సమర్పణలో ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత , ఆరు సార్లు రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అవార్డు గ్రహీత , రచయత మరియు దర్శకుడు డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో " చూశారా... భీమిలి...? " ఏఐ పర్యాటక చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హీరో నిర్మాత ఆదిత్యభూషణ్ చేతులమీదుగా డాక్టర్ మణి భూషణ్ టైటిల్ పోస్టర్ భీమిలి లో విడుదల చేసారు.
ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఎన్నో పర్యాటక అభివృద్ధి చిత్రాలను ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు అందిస్తున్నామని అందులో భాగంగా భీమునిపట్నం సౌందర్యాలను ఆవిష్కరించే " చూశారా... భీమిలి...? " - ది సౌండ్స్ అఫ్ వేవ్స్ అనే టాగ్ లైన్ తో - మొట్టమొదటి ఏఐ పర్యాటక చిత్రం సరిక్రొత్త అనుభూతిని అందిస్తుందని అందాల స్వర్గం భీమునిపట్నం, ఒక్కసారి చుస్తే చాలు ఎనలేని ఆనందం, ప్రకృతి ఒడిలో సేదదీరే అద్భుత ప్రపంచం, డచ్ వారి ఆనవాళ్లు కలిగిన చారిత్రక నగరం భీమునిపట్నం, అతి ప్రాముఖ్యత కలిగిన ఓడ రేవుగా విరాజిల్లిన ఈ ప్రాంతం, బౌద్ధబిక్షువులు నడయాడిన ఆరామాలతో , సహజ సిద్దమైన ఎర్రమట్టి దిబ్బలతో, అందమైన సముద్రతీరాన ఉన్న పర్యాటక ప్రదేశాలను అందరికి కళ్ళకు కనువిందుచేసేలా ఈ చిత్రం రూపొందిస్తున్నామని , షూటింగ్ పూర్తి అయ్యి త్వరలో టీవీ టూరిజం చానెల్ లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంస్థ సీఈఓ సీతారామస్వామి , ఎడిటర్ నీరాజభూషణ్, టీవీ టూరిజం టీం పాల్గొన్నారు.
0 Comments