ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సేవలు అజరామరం
స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
కందుకూరు ఎం బి సి: టి ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శనివారం రాష్ట్ర పండుగ అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ షేక్ నాగూర్ వలి గారు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి సేవలను కొనియాడారు.
తదుపరి స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర
కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులచే స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ షేక్ నాగూర్ వలి గారు మాట్లాడుతూ, వర్షాకాలం పరిశుభ్రత పాటించడం మనందరి బాధ్యతని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ, తమ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు కళాశాల ఆవరణలో చెత్తను తొలగించి, పండ్ల మొక్కలను నాటారని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి గారు తెలిపారు.
0 Comments