ఘోర రోడ్డు ప్రమాదం..మూగజీవాలపై దూసుకెళ్లిన వ్యాను
ఏపీ బ్యూరో చీఫ్ ఎం బి సి: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని బరడ పంచాయతీ పరిధి అంటబొంగు-ముఖిపుట్ మధ్య గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వివరాలు ప్రకారం.ముంచంగిపుట్టు వైపు నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఇచ్చే మొక్కల లోడును వేసుకొని ఓ వ్యాను బరడ వస్తున్న క్రమంలో అంటబొంగు-ముఖిపుట్ మధ్యలో పశువుల కాపరులు మూగజీవులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొస్తున్న క్రమంలో మూగజీవాల మందపై దూసుకెళ్లింది.దీంతో అక్కడికక్కడే 10 మేకలు 10 ఆవులు మృత్యువాత చెందగా వ్యాను డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు.దీంతో మూగజీవాల యజమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ప్రభుత్వమే గుర్తించి తమకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
0 Comments