కొర్రపాడు గ్రామంలో ఇసుక వాగు సమస్య వెంటనే పరిష్కరించండి : బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇంచార్జ్ వై.వి.సుబ్బారావు
కొర్రపాడు, మేడికొండూరు ఎం బి సి ప్రతినిధి : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని కొర్రపాడు గ్రామంలో ఇటీవలి వర్షాల కారణంగా ఇసుక వాగు పొంగిపొర్లి, వాగు ఒడ్డున నివసిస్తున్న ప్రజల ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఈ పరిస్థితిని గ్రామ ప్రజలు ఆందోళనతో ఉన్నారని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇంచార్జ్ వై.వి.సుబ్బారావు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ఇరిగేషన్ విభాగం AE , గ్రామంలో ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహించారు. ఆయనతో పాటు టిడిపి మేడికొండూరు మండల అధ్యక్షులు మల్లిపెద్ది రమేష్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇంచార్జ్ వై.వి.సుబ్బారావు, జనసేన నాయకులు కందులు సైదయ్య మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు తమ సమస్యలను వివరించగా, నాయకులు ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే ఎస్టిమేషన్ వేసి పూడిక తీయాలని అధికారులను కోరారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి, వెంటనే ఎస్టిమేట్ తయారు చేయించి, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాగులో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహం సక్రమంగా సాగకపోవడం ప్రధాన సమస్యగా ఉన్నదని, తక్షణం పూడిక తొలగిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని అధికారులను వై.వి. సుబ్బారావు కోరారు.
0 Comments