టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక కార్యక్రమం


కందుకూరు రూరల్ ఆగస్టు 13 ఎంబిసి ప్రతినిధి: TRR గవర్నమెంట్ జూనియర్ కాలేజ్,కందుకూర్ NSS యూనిట్ ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఆగస్టు 13వ తేదీ బుధవారం (mass pledge ) నషారహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము నందు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి మాట్లాడుతూ యువత నషారహిత సమాజం కొరకు తమ వంతుగా కృషి చేయాలని మత్తుపదార్థములకు దూరంగా ఉండాలని ఆకాంక్షించారు.

0 Comments