జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ,


కందుకూరు ఎంబిసి:- టి. ఆర్ .ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, కందుకూరు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ,ఆంధ్ర ప్రదేశ్ ఆగస్టు 12 2025 విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు కళాశాల నందు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ డిపార్ట్మెంట్ నుండి E కళ్యాణి ఎం పి హెచ్ ఏ ఫిమేల్ మరియు కోటా సుధాకర్ రావు ఎంపీహెచ్ఏ male విచ్చేసి విద్యార్థినీ విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 టాబ్లెట్స్ అందజేశారు మరియు విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ షేక్ నాగూర్ వలి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత పరిశుభ్రతను పాటిస్తూ ప్లాస్టిక్ వంటి వ్యర్థాల వైపు సమాజం వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది అని వివరించారు. ఈ కార్యక్రమం నందు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె హజరత్తయ్య మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అని కళాశాల ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి గారు తెలియజేశారు.

0 Comments