పింఛన్లు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దే.

పింఛన్లు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దే.

ఎగువశోభ పంచాయితీ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్.


అనంతగిరి ఎంబిసి, ఆగష్టు 1: అనంతగిరి మండలంలోని ఎగువశోభ పంచాయితీ కొత్తవలస గ్రామంలో శుక్రవారం ఉదయం సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మట్టం శ్యామ్, ప్రధాన కార్యదర్శి గెమ్మెల రమేష్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా వృద్ధాప్య, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్లు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దక్కుతుందన్నారు.. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చూస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సర్వేయర్ ఉదయ్ కిరణ్, టీడీపీ నాయకులు పాంగి భీమన్న, కిల్లో కృష్ణ,శెట్టి గుండు, తదితరులు పాల్గొన్నారు..

0 Comments