శ్రీ కామాక్షి అమ్మవారు ఆలయంలో శ్రావణ 5వ శుక్రవారం పూజాలు
ఎంబిసి ఆగస్టు22 సాలూరు ప్రతినిధి (కనిమెరక జ్ఞానేశ్వర్) : సాలూరు ఇలవేలుపు అయిన శ్రీ కామాక్షి అమ్మవారు ఆలయంలో శ్రావణ 5వ శుక్రవారం పూజాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసారు. ఈ రోజు శ్రీ కామాక్షి అమ్మవారినీ పువ్వులతో చక్కగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగం ఇచ్చారు.
భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు..
0 Comments