వార్ 2 రిలీజ్ రోజున మధ్యాహ్నం షోకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశ

చిత్ర ప్రదర్శన సరిగ్గా లేకపోవడం వల్ల ఉద్రేకానికి గురైన అభిమానులు 

ప్రొజెక్టర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సినిమా నిలిపివేత


ఏంబిసి ఆగస్టు 14 సాలూరు ప్రతినిధి (కనిమెరక జ్ఞానేశ్వర్) : సాలూరు రామ థియేటర్ లో ఎన్టీఆర్ కొత్త మూవీ వార్ 2 రిలీజ్ రోజున రెండవ ఆట మధ్యాహ్నం షోకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. షో వేసిన వెంటనే చిత్ర ప్రదర్శన సరిగ్గా లేకపోవడం వల్ల అభిమానులు ఉద్రేకానికి గురయ్యారు. థియేటర్ సిబ్బంది చాలా ప్రయత్నించినప్పటికీ ప్రొజెక్టర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సినిమాను నిలిపివేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వెంటనే అభిమానులకు సరిచెప్పారు. వెంటనే ఎవరివి వారి అమౌంట్ తిరిగి చెల్లించారు.

0 Comments