10 రోజులుగా మూగబోయిన బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్.
కొండిబ, సాడ అదే దయానీయం.
అనంతగిరి ఎంబిసి,ఆగష్టు 1: గ్రామాల్లో సమాచార వ్యవ స్థను మెరుగు పరిచేందుకు బీఎస్ ఎన్ఎల్ సెల్ టవర్లను ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, ఇవి సరిగా పనిచేయక వినియోగదా రులు తరచూ ఇబ్బంది ఎదుర్కొంటు న్నారు. సెల్ సిగ్నల్స్ సమస్య తలెత్తుతోంది. వీటిని తిరిగి సంబం ధిత అధికారులు పునరుద్ధరించిన రోజుల వ్యవధిలోనే అవి మామూలవు తున్నాయి. మండలంలో కొండిబ గ్రామంలో ఏర్పాటు చేసిన బి ఎస్ ఎన్ ఎల్ టవర్లు సాంకేతిక పరమైన సమ స్యతో సిగ్నల్స్ రాక వినియోగదా రులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ప్రతి నెలా రీచార్జి డేటా వేసుకుంటున్నా, ఫోన్లు పనిచేయక డబ్బు వృథా అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తంచే స్తున్నారు. ఫిర్యాదు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించు కోవడంలేదని ఆరోపిస్తున్నారు. చాలా రోజులు నుంచి సెల్ టవర్ పనిచేయకున్నా సిబ్బంది ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి అంబులెన్సుకు ఫోన్ చేయాలన్నా, దూరప్రాంతాల్లో ఉన్న తమ బంధువులతో మాట్లా డాలన్నా వీలుకావడంలేదని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించి బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ విని యోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
0 Comments