టి.ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని NSS యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం
టి.ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కందుకూరు నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని NSS యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎస్ కే. నాగూర్ వలి గారు మాట్లాడుతూ చెట్లు నరికివేత వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, దాని వలన వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ కాలుష్య సమస్యలు తలెత్తుతాయి ఈ సమస్యలన్నింటిని ఎదుర్కొనుటకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమ వంతుగా చెట్లను నాటాలి మరియు వాటిని సంరక్షించాలి అని కోరారు.
ఈ సమావేశము నందు కళాశాల అధ్యాపకులు శ్రీ ఓరుగంటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ పర్యావరణం పట్ల అవగాహన పెంచుకోవాలి మరియు పచ్చదనాన్ని ప్రేమించాలి అని చెట్ల ద్వారా వచ్చే ఆక్సిజన్ ని ఆస్వాదించాలి మరియు చెట్లను నాటడాన్ని మన అందరి బాధ్యతగా నిర్వహించాలి అని వివరించారు ఈ కార్యక్రమంలో కె హజరతయ్య కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తెలియజేశారు.
0 Comments