నర్సీపట్నం ఎంబి సి జూలై 30:ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకం దినోత్సవాన్ని పురస్కరించుకొని సబ్ కలెక్టర్ వి.వి రమణ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. శ్రీనివాస రావు, మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్ర చేతుల మీదగా సమిద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు కు చెందిన హెల్ప్ స్వచ్ఛంద సంస్త సహకారం తో పోస్టర్ విడుదల చేయుట జరిగినది
కకార్యక్రమం లో భాగంగా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మరియు డివిజనల్ మేజిస్ట్రేట్
నర్సీపట్నం వి.వి రమణ మాటడుతూ ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో యాక్షన్ ఎగైనెస్ట్ ట్రాఫికింగ్ & సెక్సువల్ ఎక్సప్లటేషన్ ఆఫ్ చిల్డ్రన్ , ఇండియా (ATSEC INDIA) – సమీద స్వచ్చంద సంస్థ సంయుక్తంగా రూపొందించిన ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డి ఎస్ పి పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ – "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మానవ అక్రమ రవాణాను అంతమొందించడంలో న్యాయవ్యవస్థ మరియు పోలీసు వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తున్నాయి. మానవ అక్రమ రవాణా ఒక సామాజిక సమస్య మాత్రమే కాదు, ఇది ఒక సుస్థిరమైన ఆర్గనైజ్డ్ క్రైమ్. దీనికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేయడం, ఇంటెలిజెన్స్ ఆధారిత విచారణలు జరపడం, నిందితులను పట్టుకోవడం ఎంతో అవసరం. బాధితులు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలి" అని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమీషనర్ జె.సురేంద్ర మాట్లాడుతూ – "మానవ అక్రమ రవాణా నిరోధక చర్యలతో పాటు బాధితుల హక్కులు, గౌరవం, నష్టపరిహారం, మానసిక వైద్యం మరియు జాప్యం లేకుండా పునరావాసం కల్పించడం అత్యంత ముఖ్యం" అని పేర్కొన్నారు.
సమిద స్వచ్చంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. వీరభద్ర రావు మాట్లాడుతూ విడుదల చేసిన పోస్టర్ ద్వారా "అక్రమ రవాణాను అరికట్టటానికి ప్రతి పోలీసు అధికారి, న్యాయవాది, సామాజిక కార్యకర్తల తో కలసి పనిచేయాల్సిన బాధ్యత ఉంది" అని వివరించారు. చట్టాన్ని అమలు చేయడంలో సాంకేతికత వినియోగం, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య మరియు ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించడం చాలా అవసరమని పోస్టర్ ద్వారా తెలియజేశారు. కార్యక్రమం లో సమిద ప్రోగ్రామ్ మేనేజర్ వరహాలబాబు, మరియు సిబ్బంది సంధ్యా రాణి, లక్ష్మీ, బాలనాగేశ్వరరరావు, కర్రి నాగేశ్వరరావు, అశ్వని, భాగ్య వరలక్ష్మి అప్పలనరస మరియు సిద్ధాబత్తుల లక్ష్మీ లు పాల్గొన్నారు
0 Comments