టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు దృష్టిలో అనంతగిరి టీడీపీ మండల కమిటీ ఎన్నికలపై పిర్యాదు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు దృష్టిలో అనంతగిరి టీడీపీ మండల కమిటీ ఎన్నికలపై పిర్యాదు. 

న్యాయం చేస్తనన్నా రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివారావు 


అనంతగిరి ఎంబిసి జులై28: అరుకు నియోజకవర్గం అనంతగిరి మండలం తెలుగు దేశం పార్టీ మండల కమిటీ ఎన్నిక గూర్చి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్ల శ్రీనివారావు కు అనంతగిరి తెలుగుదేశం పార్టీ పిర్యాదు చేయడం జరిగింది మండలం లో ఉన్న 24 గ్రామ పంచాయతీలకు గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధానకార్యదర్శి లను మండల పరిశీలకులు డప్పు వెంకటరమణ నియోజకవర్గం పరిశీలకులు శివరామకృష్ణ ఎన్నికలు పూర్తి చేసి ఉన్నారు ఇది ఇలా ఉండగా మండల అధ్యక్షులను ప్రధానకార్యదర్శిలను గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధానకార్యదర్శి లు ఎన్నిక జరిగాల్సి ఉండగా గురువారం నాడు ఎన్నిక తేదీ నియోజకవర్గం పరిశీలకులు ప్రకటించి ఇరు వర్గాలతో ఎన్నిక జరిపించాల్సి ఉండగా ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గం తో మాట్లాడి ఏకపక్షం నిర్ణయంతో వెన్నుదిరిగి వెళ్లిపోయారు ఒక వర్గమైన గాలి నరసింహామూర్తి కు (26)మంది అధ్యక్ష, కార్యదర్సులు మద్దతు ఉండగా రెండొవ వర్గమైన సోవేరి సుబ్బారావు కు (22)మంది మద్దతు దారులు కూడా గట్టుకున్నారు దీనిపై తక్షణమే మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులుఎన్నిక నిర్వహించి న్యాయం చేయగలరని అనంతగిరి మండలం కమిటీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు పల్ల శ్రీనివారావు కు పిర్యాదు చేయడం జరిగింది దీనిపై స్పందించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏక పక్ష నిర్ణయం సరికాదని దీనివలన పార్టీకి నష్టం వాటిలుతుందని అన్నారు పార్లమెంట్ అధ్యక్షులు పార్లమెంట్ పరిశీలకులతో మాట్లాడి ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమం లో మండలం అధ్యక్షులు అంటిపార్తి బుజ్జిబాబు, ప్రధానకార్యదర్శి టీ బి అనందరావు, ఉపాధ్యక్షులు సమారెడ్డి దొన్ను, పార్లమెంట్ కార్యదర్శి నెగాలి సుందరావు, సీనియర్ నాయకులు మోస్య జోగులు, బిడ్డ లక్ష్మణ్, నిర్మల, సన్నిబాబు,డుంబారి శ్యామ్,నరజి దయనిది, గురుమూర్తి, సాంబే లచ్చన్న,గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రధానకారదర్సులు పాల్గొన్నారు

0 Comments