డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో "వివిఐపి" నూతన వెబ్ సిరీస్ ప్రారంభం


విశాఖపట్నం ఎంబి సి: నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి నిర్వహణ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వెబ్ ఛానల్ టీవీ టూరిజం వారి సమర్పణలో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత , రచయత , డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో ఈరోజు టీవీ టూరిజం అడ్మిన్ ఆఫీస్ లో నూతన వెబ్ సిరీస్ "వీవీఐపీ" - విశాఖ వెరీ ఇన్స్పిరింగ్ పర్సన్ - వీళ్ళే దార్శనికులు అని ఉపశీర్షకతో ప్రముఖ ఫెర్రో అల్లోయ్స్ ఇంజినీర్ శ్రీ ఏ వి ఎల్ నరసింహం గారి జీవిత విశేషాలతో కూడిన మొదటి ఎపిసోడ్ షూటింగ్ తో ప్రారంభించారు. 

ఈ సందర్బంగా చిత్రబృందం అంగరంగ వైభవంగా నూతన వెబ్ సిరీస్ పోస్టర్ ఆవిష్కరించారు , డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ఎన్నో సామజిక చైతన్య కార్యక్రమాలతో ఎంతోమంది మనసు దోచుకున్న టీవీ టూరిజం ఛానల్ లో మరో సరికొత్త వెబ్ సిరీస్ "వీవీఐపీ" ఇది సమాజం లో ఎంతోమందికి స్ఫూర్తి కలిగించిన వారి జీవిత ప్రయాణ కధనం , ఒకో ఎపిసోడ్ ద్వారా ఒక మహానుభావుని దర్సనికతను ప్రపంచానికి పరిచయం చేసి యువతకు మార్గదర్శిగా ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఈ కాన్సెప్ట్ తయారు చేశామని , ఈ రోజు ప్రముఖ ఫెర్రో అల్లోయ్స్ ఇంజినీర్ శ్రీ ఏ వి ఎల్ నరసింహం అంతర్జాతీయంగా ఎన్నో సేవలు చేసి అజరామర కీర్తి పొందారని , ఫెర్రో అల్లోయ్స్ రంగం లో పితామహుడు గా భారత దేశ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందాల ప్రపంచ దేశాలు చుట్టివచ్చిన మంచి మానవతా వాడి , విజ్ఞాన ఖని, ఇలాంటి మహనీయుల జీవితాలు ఎంతో స్ఫూర్తి దాయకం వాటిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే సంకల్పం తో ఈ వెబ్ సిరీస్ మొదలు పెట్టమని , అందరి ఆదరణ టీవీ టూరిజం ఛానల్ కు కావాలని , మీరుకూడా ఈ వెబ్ సిరీస్ లో పాల్గొనాలంటే 9848418582 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమం లో సీఈఓ సీతారామ స్వామి, ఎడిటర్ నీరజ , హీరో నిర్మాత ఆదిత్య భూషణ్ తదితరులు హాజరయ్యారు. 

0 Comments