త్రాగునీటి సమస్య పై స్పందించిన పంచాయతీ సెక్రెటరీ.


అనంతగిరి ఎం బి సి న్యూస్ జులై 31( అల్లూరి జిల్లా ) : అనంతగిరి మండలం , బొర్రా గేటువలస గ్రామంలో మూడు రోజుల నుండి త్రాగునీటి కష్టాలతో స్థానిక మహిళలు విలవిలలాడుతున్నరన్నే పత్రిక కథనానికి బుధవారం బొర్రా పంచాయతీ అధికారి ( సెక్రెటరీ ) మోజేష్ స్పందించారు.

ముందుగా గ్రామాలకు వచ్చే గ్రావిటీ పైపులైన్ల మరమ్మతు పనులను చేయించి త్రాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టారు. వారు మాట్లాడుతూ బొర్రా సచివాలయం పరిధిలో ఏ గ్రామంలోనైనా ఏ సమస్య ఉన్నప్పటికీ తమకు తెలియ జేయ్యాలని లేదా మా ఫోన్ నెంబర్ 79819 45296, 94934 24180 కు నేరుగా సంప్రదించాలని తెలిపారు. ఆయా గ్రామాల సమస్యలు పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తానని పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

0 Comments