విజయనగరం జిల్లా లో గిరిజనులపై జిల్లా మంత్రి గారు సీత కన్నేశారు....ఎలా అంటే రామభద్రపురం మండలం మిర్తివలస పంచాయతీలో గిరిజనులు సాగు చేసుకున్న భూముల్లో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పంట నాశనం చేయడం.
అడిగితే ఆ భూమిని 2017లో ఎంఎస్ఎమ్ఈకి కేటాయించారని చెప్పడం.
కానీ ప్రభుత్వం 2020 ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చిందంటే గమనించకపోవడం.
అలాగే ఎస్ కోట మండలం ముసిడిపల్లి పంచాయతీ బంధవలస గ్రామ గిరిజనులకు కూడా ఇలాగే సమాచారం ఇవ్వకుండా వారి వ్యవసాయాన్ని వేపుగా పెరిగిన 30 40 సంవత్సరాల వయసున్న జీడీ మామిడి చింత చెట్లను తొలగించడం.
కూడా కారణం అదే కాకుండా జిందాల్ భూముల్లో ఎం ఎస్ ఎం ఈ పేరిట గిరిజన బాధితలు ఉన్నారు.
అలాగే కొత్తవలస మండలంలో రేల్లీ రెవెన్యూ అప్పనదొర పాలెం పంచాయతీ లో గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన 526 ఎకరాలు భూమిని అక్కడ యూనివర్సిటీ నిర్మాణం లేనప్పుడు వారి భూముల వారికి అప్పగించి వారికి ఎటువంటి న్యాయం చేయడం లేదు.
అలాగే ఆయన సొంత నియోజకవర్గమైన గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం షికారు గంజిలో నివసిస్తున్న గిరిజనులు మంచినీరు కరెంటు వంటి మౌలిక సదుపాయాల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.
అలాగే ఆయన సొంత మండలం అయిన గంట్యాడ మండలంలో వైకే పత్తి పంచాయతీ పరిధిలో నేటికీ రోడ్లు మంచినీరు లేక గిరిజనుల అవస్థ పడుతున్నారు.
ఇంకా చెప్పుకుపోతే జిల్లాలో గిరిజనుల కష్టాలు ఆయన పట్టించుకోరని అనుకోవాలి.
ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి అందాల డోలి సమస్యల పరిష్కరించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే.
ఆయన మాత్రం గిరిజనులను వెనక్కి తోసే ప్రయత్నం చేస్తున్నారు.
కొండకోనల్లో ఉన్న గిరిజనుల తరఫున అడిగేనాధుడు లేడనే ఆయన ఇలా చిన్నచూపు చూడడం సబబు కాదు.
గిరిజనులు ఎక్కడ ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదు.
కానీ సానుకూల సమస్యను కూడా పెద్దది చేసి హడలెత్తించడంపై మా మీకు గిరిజనులపై ఉన్న గౌరవం అర్థం అవుతుంది.
ఈ విషయంపై గిరిజనుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఈవిషయాన్ని స్పందించి సమగ్ర విచారణ జరిపించి విజయనగరం జిల్లా గిరిజనులను ఆదుకొని న్యాయం చేయగలరని మనవి ...తుమ్మి అప్పలరాజు దొర
ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయనగరం జిల్లా చైర్మన్
8 5 0 0 0 4 4 4 2 3
0 Comments