డాక్టర్ మణి భూషణ్ దర్శకత్వం లో " జీవ వైవిద్యం " ఏఐ లఘు చిత్రం పూర్తి


ఎంబిసి విశాఖపట్నం: నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ వారి అద్వర్యం లో డిజిటల్ వీడియోస్ సంస్థ నిర్వహింపబడుతున్న టీవీ టూరిజం ఛానల్ వారి నిర్మాణం లో ప్రముఖ దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత , రచయత , ఫౌండర్ డాక్టర్ మణి భూషణ్ గారి దర్శకత్వం లో    " జీవ వైవిద్యం "  - రక్షో రక్షతి రక్షతః  అనే లఘు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ ప్రకృతి ని ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ చిత్రం ద్వారా స్ఫూర్తిని పొందుతారు , మనిషి మనుగడకు ఈ భూమి సమస్త జీవరాసులతో నిండి ఉంది ,

ఈ భూమిమీద జీవించే హక్కు ప్రతి ఒక్క ప్రాణికి ఈ ప్రకృతి ప్రసాదించిన వరం . కాలక్రమేణా ఎన్నో అంతరించిపోయే ప్రాణులు , మొక్కలు మానవ జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి , ప్రకృతి లో అన్ని జీవరాసులు ఆనందంగా బ్రతికితేనే జీవ వైవిద్యం , మన భారతీయ సనాతన ధర్మం , వేదాలు , పురాణాలూ , బుద్ధిజం , జైనిజం , అన్ని మతాలు , అన్ని వర్గాలు  , జాతులు జీవ వైవిధ్యాన్ని ఉన్నతంగా కాపాడాయి , అలనాటి ఆయుర్వేదం మానవ జీవనానికి , మన పండగలు వాటి వెనక దాగిఉన్న ప్రకృతి , పర్యావరణ పరిరక్షణ , జంతు సంరక్షణ  జీవ వైవిధ్య రహస్యాలను మానవాళికి అందించారు . 

అలంటి ఒక గొప్ప సామజిక ఇతివృత్తం తో ఈ లఘు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని , తోలి సరిగా  జీవ వైవిద్యం పై ఏ ఐ సాంగ్ మరియు చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసి అందిస్తున్నామని , ఈ చిత్రం షూటింగ్ బయో డైవర్సిటీ పార్కు లో జరిగిందని , సహాయసహకారాలు అందించిన బోటనీ లెక్చరర్  శ్రీమతి ప్రవీణ గారికి ధన్యవాదాలు తెలిపారు  త్వరలో టీవీ టూరిజం ఛానల్ లో ఈ చిత్రం విడుదల అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో సీఈఓ సీత రామ స్వామి , ఎడిటర్ నీరజ , హీరో ఆదిత్యభూషణ్ మరియు టీవీ టూరిజం టీం సభ్యులు హాజరయ్యారు.

0 Comments