డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ
ఏపి బ్యూరో చీఫ్ ఎంబిసి: అరకులోయ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంతోపాటు మాడగడ గన్నేల పిహెచ్సిల వద్ద డెంగ్యూ వ్యాధి నివారణపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.అల్లూరి జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ మాడగడ గన్నెల పీహెచ్సీల వైద్యాధికారులు ఉదయ్ ప్రశాంత్ జ్యోతిస్వరూప కమలాకుమారి పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.టైగర్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని జ్వరం తలనొప్పి చలి కళ్ళు ఎరబడటం వంటి లక్షణాలతోపాటు రక్త కణాలు తగ్గిపోతాయన్నారు.ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవరాజు హెల్త్ ఎడ్యుకేటర్లు భద్రయ్య మూర్తి సబ్ యూనిట్ అధికారి అప్పలస్వామి సూపర్వైజర్లు సుజాత ముత్యాలమ్మ కుమారి తదితరులున్నారు.
0 Comments