సాలూరు బ్రహ్మకుమారిస్ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి


ఏంబిసి మే 18 సాలూరు ప్రతినిధి ( కనిమెరక జ్ఞానేశ్వర్): సాలూరు శ్రీ శ్యామలాంబ దేవి ఉత్సవాల సందర్భంగా సాలూరు బ్రహ్మకుమారిస్ సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి సంధ్యారాణి గారు ప్రారంభించారు.

ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయబడిన 1. నవదుర్గలు దర్శనం, 2. 16 అడుగుల శివలింగం, 3. దీవిలా అద్దాల మందిరం, 4. రావణ సంహారం - స్వర్గస్థాపన స్టాల్, 5. విలువలతో కూడిన ఆటలు ప్రదర్శన (వాల్యూ గేమ్స్) కార్యక్రమాలను సందర్శించారు. బ్రహ్మకుమారిస్ సంస్థ వారు ఇటువంటి విలువతో కూడిన ఎగ్జిబిషన్స్ పెట్టటం వలన సమాజంలో నైతిక విలువలు పెరుగుతున్నాయి అని సంధ్యారాణి గారు తెలిపారు.

ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టినందుకు సాలూరు బ్రహ్మకుమారిస్ ఇంచార్జ్ బీకే రత్న అక్కయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. సాలూరు బ్రహ్మకుమారిస్ ఇంచార్జ్ BK.రత్న అక్కయ్య గారు మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలను జాగృతి చేయడానికి బుద్ధి వికాసానికి, సుఖ - శాంతి సంపత్తి సమృద్ధిగా దైవ గుణాలతో నిండుగా మారి విలువలతో కూడిన ప్రపంచాన్ని తయారు చేయడమే బ్రహ్మకుమారిస్ సేవా సంస్థ మౌంట్ అబూ కేంద్రంగా పనిచేస్తుంది. మన సాలూరు గ్రామదేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర సందర్భంగా 18,19, 20 తేదీల్లో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశాము. సాలూరు శ్యామలాంబ జాతరకు విచ్చేసిన భక్తులందరూ ఈ ఎగ్జిబిషన్ సందర్శించి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలని రత్న అక్కయ్య తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి సంధ్య గారు విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి గారితో పాటు సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి గారు, మాజీ చైర్ పర్సన్, జరజాపు ఈశ్వరరావు రావు గారు, విలేకరులు, భక్తులు బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

0 Comments