ఆపరేషన్ సింధూర్ విజయానికి దేశం మొత్తం వందనం చేస్తోంది
దేశ ప్రజలందరికీ ఆపరేషన్ సింధూర్...మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ఎంబిసి మే 16 సాలూరు ప్రతినిధి (కనిమెరక జ్ఞానేశ్వర్) :ఇది గర్వించదగ్గ విజయం. దేశ భద్రతను కాపాడాలనే త్రివిధ దళాల దృఢ సంకల్పంతో ఆపరేషన్ విజయవంతమైంది. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం వందనం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమం మరియు గిరిజన వ్యవహారాల మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు మున్సిపల్ కార్యాలయం నుండి బోసు బొమ్మ జంక్షన్ వరకు జరిగిన తిరంగ యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమిష్టిగా మూడు సేవలకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ అఖండ విజయానికి దేశ సాయుధ దళాలు చూపిన శౌర్యం, ధైర్యం మరియు త్యాగాలను గౌరవించేందుకు తిరంగ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆమె అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన గొప్ప విజయ యాత్ర ఇది అని ఆమె అన్నారు. ఈ యాత్ర పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఉంది. రాష్ట్ర పౌరులందరూ ఈ యాత్రలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కమిషనర్ కృష్ణారావు, తహసీల్దార్ రమణ, ఎంపీడీఓ పార్వతి, ఉద్యోగులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 Comments