సస్టైనబిలిటీ సమ్మిట్ 2025 లో పాల్గొన్న డాక్టర్ మణి భూషణ్
ఎంబిసి విశాఖపట్నం: నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవ సంస్థ విశాఖ ట్రావెల్ అండ్ టూరిజం ఫౌండేషన్ అధినేత ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ మణి భూషణ్ గారు ఈరోజు కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మరియు కొన్ని స్వచ్ఛందల సంస్థల అద్వర్యం లో హోటల్ నోవొటెల్ లో జరిగిన సస్టైనబిలిటీ సమ్మిట్ 2025 లో పాల్గొన్నారు , ఈ సదస్సు ద్వారా ఎన్నో మానవ మనుగడకు అవసరం అయినా , సుస్థిర విధానాలు గూర్చి వక్తలు పలు సూచనలు , అనుభవాలను పంచుకున్నారు .
ఈ సందర్బంగా డాక్టర్ మణి భూషణ్ మాట్లాడుతూ సుస్థిర విధానం ద్వారా ఎన్నో పర్యావరణ, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధి కి నాంది పలకవచ్చు అని తెలిపారు . రాబోయే రోజుల్లో సుస్థిర విధానాలు తెలుసుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యత , జీవ వైవిద్యం , అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుట వంటి మార్పులు కు ఆహ్వానం పలకవచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన మంచి అవగహన కార్యక్రమం ఏర్పాటు చేసిన సి.ఐ.ఐ ఆంధ్రప్రదేశ్ వారికీ ధన్యవాదాలు తెలిపారు.
0 Comments