ఆక్రమణ ప్రదేశంలో పర్యటించి పరిశీలించిన
అరకు ఎమ్మెల్యే రేగం.మత్స్యలింగం
అనంతగిరి జడ్పిటిసి దీసరి గంగరాజు
అనంతగిరి ఎంపిపి శెట్టి నీలవేణి
అనంతగిరి ఎంబిసి ఏప్రిల్ 28: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బీంపోలు పంచాయితీ సరియపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 69/5 లో ఎ1-50 సెంట్లు భూమి మామిడి.రాధమ్మ జిరాయితీ భూమి తాత్త ముత్తతల కాలం నుండి సాగు చేస్తున్నారు. ఆభూమిలో అరటి మొక్కలు వేసి తోటలు పెంచుతుండగా ఇటోర్ వెంచర్ యజమాని బి.నగేష్ రైతులు వేసిన కంచెలను జేసిబి లతో ధ్వంసం చేస్తూ భూములు ఆక్రమించుకొంటున్నాడు రెవెన్యూ అధికారులు ఇటోర్ వెంచర్ యజమానికి తొత్తులుగా వ్యవహరించి గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవుతున్న ఆక్రమణ జరుగుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఇటోర్ వెంచర్ కు చుట్టూ ప్రక్కల ఉన్న ప్రభుత్వం భూములు భూస్వామి బి.నగేష్ కు ధారాదత్తం చేస్తూ పెత్తందారీ వ్యవస్థకు ఊత్తం ఇస్తూ గిరిజనులకు భయభ్రాంతులకు గురి చేసి అల్లో కల్లోలం సృష్టిస్తూ అడిగినా వారిపై కిరాయి మూకలతో రౌడిలు ఉసిగొల్పి ప్రత్యేక్ష దాడులకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంతా నాకు దన్నుగా ఉన్నది అంటూ కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు.రామోహాన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజరాపు. అచ్చెంనాయుడు లాంటి పెద్దలు నాకు వెన్ను దన్నుగా ఉన్నారు అంటూ కూటమి ప్రభుత్వం పేరు చెప్పి రెచ్చిపోతున్న భూస్వామి రెవెన్యూ అధికారులు డబ్బులకు లొంగిపోతున్నారా అధికారాన్ని భయపడుతున్నారా రెవెన్యూ అధికారుల పాత్ర భూకబ్జా ఉన్నట్టు గిరిజనులు ఆరోపిస్తున్నారు.గిరిజనుల భూములను, ప్రభుత్వం భూములను,నదిపరివాహకపప్రాంతం, ప్రభుత్వం శీలింగ్ భూములను కొండలను బద్దలు కొట్టి చదును చేసి ఆక్రమణలకు పాల్పడుతున్న ఒక నోటిస్ కూడా ఇవ్వకుండా కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ కి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పి.ఒ కి సబ్- కలెక్టర్ కీ పిర్యాదు చేస్తామని గిరిజనుల భూములు ఆక్రమించి భయభ్రాంతులకు గురి చేస్తున్న భూస్వామి బి.నగేష్ పై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి డిఎస్పీ కి పిర్యాదు చేయడం జరుగుతుందని కోరాడం జరిగింది
ఈ కార్యక్రమంలో భూ బాధిత కుటుంబికులు మామిడి.అప్పలకొండ సర్పంచ్ ల మండల ఫోరం అధ్యక్షుడు పాగి.అప్పారావు బీంపోలు ఎంపిటిసి శిరగం. అశోక్ వైసిపి మండల అధ్యక్షుడు కొర్ర.సూర్యనారాయణ, బీంపోలు మాజీ సర్పంచ్ జన్ని.చిన్నయ్య నీటి సంఘం వైస్ చైర్మన్ జ్యేష్ట వెంకటరమణ,నీటి సంఘం మెంబర్ తామరపు.రాంబాబు,జలు అందరూ పాల్గొన్నారు
0 Comments