లుంగపర్తిలో పౌష్టికాహార పక్షోత్సవం కార్యక్రమం

లుంగపర్తిలో పౌష్టికాహార పక్షోత్సవం కార్యక్రమం

అంగనవాడి సూపర్వైజర్ డి జాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన వెయ్యి రోజుల పోషణ పక్వాడ కార్యక్రమం..


అనంతగిరి ఎంబిసి ఏప్రిల్ 17: అనంతగిరి:అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లుంగపర్తి గ్రామ పంచాయతీ యందు లుంగపర్తి సెక్టార్ స్థాయి "పోషణ పక్వాడా" కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లుంగపర్తి మరియు వాలసి గ్రామ పంచాయతీ గర్భిణీలు,బాలింతాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా అంగనవాడి సిడిపిఓ సి.హెచ్ సంతోష్ కుమారి,అదనపు సిడిపివో అచ్యుత పాల్గొన్నారు.

వారు పాల్గొని గర్భవతులు,బాలింతాలు మరియు చంటిపిల్లలకు 'వెయ్యి రోజుల సంవరక్షణ' కొరకు అనేక విషయాలు గూర్చి వివరించారు. బిడ్డ యొక్క పునాది దశ అయినా మొదటి వెయ్యి రోజుల సంవరక్షణ బాగుంటే పిల్లల భవిష్యత్ బాగుంటోందని తెలిపారు. అదేవిధంగా బాల్య వివాహాలు చేసుకోవడం మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీ వలన కలిగే అనర్థలు గురించి వివరించారు.మరియు పోషణ పక్వాడ్ కార్యక్రమానికి లుంగపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా.పి మంజు భార్గవి పాల్గొని పోషణ-ఆరోగ్యం గురించి వాటి యొక్క ఆవశ్యకతను వివరించారు.ఈ కార్యక్రమంలో హెచ్.వి,హెల్త్ సూపర్వైజర్లు వెంకట లక్ష్మి,ఆశ వర్కర్ దూరు శాంతి,అంగనవాడి కార్యకర్తలు కళావతి, సంగీత,వసుంధర,అమల, కొండమ్మ, సింహాచలం, మహిళా పోలీస్ శిరీష మరియు తదితరులు పాల్గొన్నారు.

0 Comments