బస్కీ తారురోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్.


ఏపి బ్యూరో చీఫ్ ఎంబిసి: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని బస్కీ తారురోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు.బాలదేవ్ సోమవారం డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ..పి.ఎం.జి.యస్.వై పథకం ద్వారా గుత్తేదారు అరకులోయ నుంచి 19 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణ పనులు చేపట్టి 8 నెలలుగా రహదారిపై కంకరరాల్లు పోసి అర్ధాంతరంగా విడిచి పెట్టేసారన్నారు. దీంతో అరకులోయ డుంబ్రిగుడ హుకుంపేట పాడేరు సరిహద్దు గ్రామాల గిరిజనులు అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆస్పత్రులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.రానున్న వర్షాకాలం దృష్ట్యా అధికారులు ప్రభుత్వం స్పందించి అర్ధాంతరంగా విడిచిపెట్టేసిన ఈ తారురోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షాన గిరిజనులతో కలసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments