అసంపూర్తిగా కిత్తలంగి అంగన్ వాడీ భవనం

అసంపూర్తిగా కిత్తలంగి అంగన్ వాడీ భవనం...

గోడ కట్టారు 

కానీ...ప్లాస్టింగ్,తలుపులు,కిటికి వేయాడం మరిచారు అసంపూర్తి గా ఉన్న భవనం పూర్తి చేయాలని.

సిపిఎం మండల నాయకురాలు కామ్రేడ్ స్వాభి కాసులమ్మ డిమాండ్


అనంతగిరి ఎంబిసి ఏప్రిల్ 20: అనంతగిరి:అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి చెందిన కోనాపురం గ్రామ పంచాయితీ కిత్తలంగి గ్రామం ఇక్కడ నివసిస్తున్న గ్రామ నివాసులంతా ఆదిమ జాతి గిరిజన తెగ పరేంగిపోర్జ(పివీటిజీ)లుగా పుట్టడం తప్పు.తక్కువ జాతి కులస్తులు అందుకేనేమో భవనం అసంపూర్తిగా మిగిలింది.ఈ గ్రామమే కాదు ఈ పంచాయతీలో మరొక గ్రామం బోందుగుడ కూడా ఇదే దుస్థితి.కిత్తలంగి గ్రామ ఆవరణలోనీ పాఠశాల ఆవరణలో చేపట్టిన అంగన్ వాడీ భవనం నిర్మాణం చేపట్టి పదకొండేలు అయినా పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉంది

.గతంలో ఇదే తెదేపా ప్రభుత్వ హయాంలో పంచాయితీ రాజ్ శాఖలో 11 లక్షలతో దీనిని మంజూరు చేశారు.భవన నిర్మాణం 2014 వ సంవత్సరంలో ముచ్చటగా మూడు నెలలు పనులు చురుగ్గా జరిగాయి.తర్వాత నత్తనడక నడిచింది.దీని గురించి ఎన్నో మార్లు జిల్లా కలెక్టర్ కు,సబ్ కలెక్టర్ కు,ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారులకు వినతులు ఇచ్చి అలిసి ఎదురు చూపులు చూసిన కళ్ళు మసక బారిపోయాయి. ఇప్పటికైనా పై అధికారులు,ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోని పూర్తి చేయాలనీ సిపిఎం అనంతగిరి మండల నాయకురాలు కాసులమ్మ స్వాభి డిమాండ్ చేశారు.

0 Comments