చిన్నారుల్లో పోషకాహారా లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా


ఏపి బ్యూరో చీఫ్ ఎంబిసి: చిన్నారులలో పోషహాకార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంగన్వాడి సూపర్వైజర్ వైజే.గాయత్రి అన్నారు.బుధవారం అనంతగిరి మండలంలోని పెదబిడ బాలుర ఆశ్రమ పాఠశాల వద్ద పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు.పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు వినియోగంపై కల్పించారు.ప్రతిరోజు తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వలన విటమిన్లు ప్రోటీన్లు ఖనిజా లవణాలు లభిస్తాయన్నారు.దీంతో రక్తవృద్ధి ఎదుగుదల రోగనిరోధక శక్తి కరగడంతోపాటు జీవక్రియ మెరుగు పర్చడంతో శరీరం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వైసిపి నేత కృష్ణమూర్తి టిడిపి నేత దేముడు హెచ్ఎం మహిళ సంరక్షణ కార్యదర్శి అంగన్వాడి ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

0 Comments