కర్రెగుట్టలపై బాంబు దాడులు నిలిపివేసి, మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు జరపాలి. ప్రజా సంఘాలు

కర్రెగుట్టలపై బాంబు దాడులు నిలిపివేసి, మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు జరపాలి. ప్రజా సంఘాలు


పిడుగురాళ్ల ఎంబిసి: చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో గత వారం రోజుల నుండి 12 వేల మందికి పైగా సాయుధ పోలీస్ సైనిక బలగాలు కర్రెగుటను చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం జరపాలని,

జనవరి 1, 2024 నుండి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గడ్ రాష్ట్రం మహారాష్ట్ర గడ్చిరోలి తెలంగాణ ఒడిస్సా రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా దేశంలోని మేధావులు, హక్కుల సంఘాలు ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు రచయితలు, ఎడిటర్లు, రాజ్యాంగాన్ని ఐదవ షెడ్యూల్ ,ఆరవ షెడ్యూల్ పెసా చట్టాలను కాపాడుకోవాలని ఆదివాసి హననాన్ని ఆపి వేయాలని, మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు, గత వారం రోజుల నుండి చత్తీస్గడ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట చుట్టూ సాయుధ పోలీసు బలగాలను హెలికాప్టర్లు, ద్రోణులను మోహరించి ఆదివాసులను మావోయిస్టులను హతమార్చే లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడిని నిలిపివేయాలని శాంతి చర్చలు వెంటనే కొనసాగించాలని బలగాలను ఉపసంహరించుకోవాలని, అలాగే పార్లమెంట్లో చట్టం చేసిన వక్ప్ బోర్డ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరడం జరిగింది.

ఉదయం 10 గంటలకు పిడుగురాళ్ల పిల్లుట్లరోడ్డు సున్నపు భట్టీల సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పిడిఎమ్ రాష్ట్ర నాయకులు కే శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, భారత బచావో జిల్లా కార్యదర్శి షేక్ సర్దార్, ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్రహం లింకన్, జిల్లా కార్యదర్శి ఓర్సు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments