ఉపాధి వేతన దారులు ప్రధానమంత్రి సురక్ష బీమా కలిగి ఉండాలి.

ఉపాధి వేతన దారులు ప్రధానమంత్రి సురక్ష బీమా కలిగి ఉండాలి..ఎంపీడీవో ఏవివి కుమార్.


అనంతగిరి ఎంబిసి న్యూస్ ఏప్రిల్ 23 ( అల్లూరి జిల్లా ) : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ గ్రామీణభివృద్ధి కమీషనర్ మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫ్రాన్స్ ఆదేశాలు మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి పనులు చేపడుతున్న ప్రతి వేతనదారులకు ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద సo,, నకు 20/- రూపాయలు తమ బ్యాంకు అకౌంట్స్ నుండి తీసుకున్నట్టు సమ్మతి పత్రం సంబందిత ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా బ్యాంకు కు ఇట్చిన యెడల భీమా లబ్ధిదారులు ఆక్సిడెంట్ లో మరణించిన లేక పూర్తిగా అంగవై కల్యం చెందిన రూ. 2 లక్షలు ఇన్సూరెన్సు వర్తిస్తుంది. అలాగే పాక్షికంగా అంగ వైకల్యం పొందిన రూ.1 లక్ష ఇన్సూరెన్సు పొందవచ్చును, మరియు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో రూ. 436/- చెల్లుంచుటకు బ్యాంకు కన్సర్న్ ఫారం ఇచ్చినట్లయితే లబ్ధిదారులు ఆక్సిడెంట్ లేదా సహజ మరణం అయితే రూ. 2 లక్షలు ఇన్సూరెన్సు పొందవచ్చును, ఈ యొక్క డేటా ఫారం సంబంధిత ఉపాధి హామీ క్షేత్ర సిబ్బందికి ఈ నెల 30 వ తేదీ లోపల వేతన దారులు అందించి నట్లయితే భీమా ఇన్సూరెన్స్ సౌకర్యం పొందవచ్చు, ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మండలంలో ఉన్నా వేతన దారులు ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని ఎంపీడీవో ఏవివి కుమార్ తెలిపారు.

0 Comments